|
| సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర | |
నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు.
వాస్తు శాస్త్ర రీత్యా మనం నిద్రకు ఉపక్రమించే సమయంలో మన తల దక్షిణ దిశగా ఉండాలని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. ఎందుకంటే మిగిలిన దిశల కన్నా దక్షిణ దిశలో తల ఉంచి నిద్రించడం వల్ల అనేక రకాలుగా మనకు మంచి జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.
దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో సంతోషకరమైన సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగి అతని జీవితం సంతోషమయంగా ఉంటుదని వారు చెబుతున్నారు. అలాగే దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం సైతం చక్కగా ఉండి ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.
దక్షిణ దిశగా నిద్రించడం వల్ల అనేక లాభాలు చేకూరడమే గాక చక్కటి నిద్ర సైతం మనకు లభిస్తుందని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - భారత క్రికెట్ జట్టులో ఇటీవల నిలకడైన ఆటతీరు కనబరుస్తున్న గౌతమ్‌గంభీర్ పేరుకు తగ్గట్టూ గంభీరమైన... |
| |
|
|
|
|
|
|
|