|
| నివాసానికి యోగ్యమైన స్థలాల ఎంపికలో జాగ్రత్తలు | | - సంకలనం మునిబాబు |
| శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 ( 16:07 IST ) |
|
ఓ కుటుంబం సకల సంపదలతో నిత్య సంతోషాలతో విలసిల్లాలంటే వారు నివశించే ఇల్లు ఉండే ప్రదేశం కూడా వాస్తు రీత్యా యోగ్యమైనదిగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు.
వీరి సలహా ప్రకారం ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్ధలన్ని ఎంపిక చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఆ స్థలంలో నిర్మించిన గృహంలో నివశించే వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని చెబుతున్నారు.
వాస్తు విజ్ఞానుల ప్రకారం ఇంటిని నిర్మించాలనుకున్న స్థలం దేవాలయానికి సమీపంలో ఉంటే చాలా మంచిది. అయితే దేవాలయంలోని గర్భగుడికి వ్యతిరేక దిశలో మనం ఇల్లు కట్టాలనుకున్న స్థలం ఉండరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి స్థలంలో ఇళ్లు కట్టకపోవడమే మేలని వాస్తు విజ్ఞానుల ఉవాచ.
అమ్మవారి దేవాలయానికి సమీపంలో ఇంటి స్థలం ఉండవచ్చు, కానీ అమ్మవారి దృష్టి ఆ స్థలంపై పడే విధంగా ఉంటే మాత్రం ఆ స్థలం నివాసానికి యోగ్యం కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే వాగులు, కొలను, కాలువలు సమీపంలోని స్థలాలు కూడా ఇళ్లు కట్టడానికి పనికి రావని వాస్తు పండితులు తేల్చేస్తున్నారు.
ఇంకా వీధి మలుపుల్లో ఉండే స్థలాలను ఇంటి నిర్మాణానికి వాడరాదని వారు చెబుతున్నారు. ఎవైనా ఆత్మహత్యలు లాంటి సంఘటనలు జరిగిన స్థలాల్లోను నివాస నిమ్మితం నిర్మాణాలు చేయకపోవడమే మంచిదని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | | శ్రీశాంత్ | | పుట్టిన తేది: ఫిబ్రవరి 6 1983
అదృష్ట సంఖ్యలు: 4, 6, 9
భారత క్రికెట్ జట్టులోకి 2005లో ప్రవేశించిన... |
|
| |
|
|
|
|
|
| టాలీవుడ్ - జయం సినిమాతో పరిచయమైన నితిన్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. |
| |
|
|
|
|
|
|
|