యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
పెళ్లి మండపం నిర్మాణంలో వాస్తు అవసరమా.....?
మంగళవారం, 26 ఫిబ్రవరి 2008   ( 15:32 IST )
ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వాస్తు శాస్త్రం పెళ్లి మండపం నిర్మాణంలో కూడా అవసరమా...? అంటే అవుననే అంటున్నారు వాస్తు విజ్ఞానులు. వ్యక్తులు నివశించే ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఇద్దరు వ్యక్తులను జీవితాంతం ఒక్కటి చేసే పెళ్లి మండపానికి కూడా వాస్తు అంతే ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నివశించే ఇంటికి వాస్తు లోపం ఉంటే దానిలో నివశించే వారికి కీడు జరిగినట్టే సరైన వాస్తు ప్రకారం నిర్మించని పెళ్లి మండపంలో పెళ్లి జరిగితే ఆ దంపతుల దాంపత్య జీవితంలో కూడా కష్టాలు వచ్చే అవకాశముందని వాస్తు శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం వెళ్లి మండపానికి ఈశాన్యంలో రోలు పొత్రాన్ని ఉంచాలి. అలాగే మండపానికి దక్షిణ దిశగా అంటే యమదర్మరాజు స్థానంగా పేర్కొనే దిశలో పురోహితుడు కూర్చోవాలి.

ఇక వాయువ్యంలో తోడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి అతని పక్కన పెళ్లి కుమారుడిని కూర్చో పెట్టాలి. అలాగే ఉత్తర దిశగా పెళ్లి కుమార్తే తండ్రిని కూర్చో బెట్టాలి. నైరుతీ దిశగా తోడు పెళ్లి కూతురును కూర్చోబెట్టి వారి ప్రక్కనే పెళ్లి కుమార్తెను కూర్చో బెట్టాలి.

పై విధంగా వాస్తు రీత్యా అమర్చిన పెళ్లి మండపంలో పెళ్లి జరిపిన పక్షంలో ఆ దంపతుల దాంపత్యం అన్యోన్యంగా, అన్ని రకాల సుఖశాంతులతో వర్ధిల్లుతుందని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చిక్కులు తెచ్చి పెట్టే వాయువ్యంలో పడకగది
వివిధ గదుల అలంకరణ: వాస్తు వివరాలు
నివశించే గృహంలో తలుపుల సంఖ్య: సంభవించే ఫలితాలు
గృహ ఆవరణలో మట్టి నింపవచ్చా?
గృహ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మాణం
గృహ నిర్మాణ పర్యవేక్షణలో జాగ్రతలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
AP
 
శ్రీశాంత్
పుట్టిన తేది: ఫిబ్రవరి 6 1983 అదృష్ట సంఖ్యలు: 4, 6, 9 భారత క్రికెట్ జట్టులోకి 2005లో ప్రవేశించిన...
భావన
ఇశాంత్ శర్మ
వినోదం
టాలీవుడ్ - జయం సినిమాతో పరిచయమైన నితిన్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace