యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
గృహ నిర్మాణంలో సిద్ధాంతిని సంప్రదించ వలసిన సందర్భాలు
- సంకలనం: వెంగళరావు
గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే పనులన్నీ వాస్తు రీత్యా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. అటువంటు సమయంలో కొన్ని విషయాలను తప్పని సరిగా గమనించాలి.

ప్రధమంగా నూతన గృహ నిర్మాణంలో నుయ్యి, బోరు మార్కింగు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లింత్ బీములు వేసి ఒకసారి పిల్లర్లు వేసిన తర్వాత ప్లాను ప్రకారం ఉన్నదీ లేనిది సరి చూసుకోవడం అవసరం. అనంతరం మెట్లు మార్కు చేయటానికీ వాస్తు తప్పనిసరిగా చూడాలి. అంటే చిన్నస్థలం మరియు వీధి పోట్లు రాకుండా చూసుకోవండ వంటివి గమనించాలి.

కాంపౌండు పునాదులకు మార్కు చేయటంలో శ్రద్ధ చూపాలి. వాస్తు రీత్యా మాత్రమే కాకుండా సాధారణంగా కాంపౌండు సరిగ్గా లేక పోయినట్లైతే మన స్థలం పరులపాలయ్యే అవకాశం ఉంది. శ్లాబుకు ముందు, శ్లాబులో వాటం, బాల్కనీలో వాటం, శ్లాబులో హుక్కులు పెట్టడం మొదలయినవి వాస్తు సిద్ధాంతి దృష్టికి తీసుకుపోవడం మంచిది.

మరి కొంచెం ముందుకు వెళితే ఇంటి ద్వారాలు, కిటికీలు, అలమారాలు మార్కుచేసే సమయంలో, గోడలు కట్టే సమయం, లింటలు, అటకలు వేయునపుడు, ప్లాస్టరింగు ప్రారంభ సమయాల్లోను, గృహం లోపల ఫ్లోరింగులో వేసే సందర్బంలోను వాస్తు సిద్ధాంతిని తీసుకు వచ్చి ఒక సారి చూపించి ప్రారంభించాలి.

నూతన గృహ నిర్మాణ సమయంలో నీటి సంపు, సెప్టిక్ ట్యాంకు, ఉపగృహం, బయట మరుగుదొడ్లు మార్కు చేయుట, కాంపౌండు గోడలు పెట్టుట, బయటి గచ్చులు, వాటం వగైరా చేసేటప్పుడు, ఫినిషింగులు అవుతున్నప్పుడు, గృహ ప్రవేశం చేసి, పూర్తిగా ఇంట్లోకి మారిన తర్వాత చివరి సారిగా ఇంట్లో సర్థిన వస్తువుల అమరిక చూడటం కోసం అంటూ ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి తరచూ వాస్తు సిద్ధాంతిని తీసుకు వచ్చి వాస్తు రీత్యా ఉన్నది లేనిది తెలుసుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇళ్లు కట్టుకునే స్థలానికి ఏ దిశలో నివాసం ఉండాలి...
గృహంలో మంచం వేసుకోవలసిన పద్దతి
కుటుంబ సభ్యులు నిద్రించే అనువైన దిశలు
గృహంలో పడక గదులు, నిద్రించే దిశలు
వివిధ గృహాలు, వాటి అమరికలు
పూజగది ఎక్కడ ఉండాలి?
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace