యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
బొద్దుగుమ్మ నమిత
17 ఏప్రిల్ 2009   ( 17:25 IST )
nameetha
PC
పుట్టినతేది: మే 10, 1981
అదృష్ట సంఖ్యలు: 2, 4, 8.
ముద్దుగుమ్మగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అటుపై బొద్దుగుమ్మగా మారిన నమిత తాజాగా వచ్చిన బిల్లా చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. సొంతం చిత్రంతో 2002లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నమిత అటుపై కొన్ని చిత్రాల్లో నటించినా బ్రేక్ రాకపోవడంతో తమిళ పరిశ్రమకు తరలిపోయిన సంగతి తెలిసిందే.

ప్రారంభంలో కాస్త నాజుగ్గానే ఉన్న నమిత అటుపై ఊహించని రీతిలో బొద్దుగా మారిపోయినా తమిళ తంబిలు మాత్రం ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దాంతో తెలుగు తెరకు పూర్తిగా దూరమైన నమిత తాజాగా ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా చిత్రంతో మరోసారి తెలుగుతెరపై తళుక్కుమంది. అలాగే రాజా సరసన జగన్మోహిని చిత్రంలో సైతం నమిత నటిస్తోంది. నమిత కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే కాస్త ఆశ్చర్యం వేయకమానదు.

సొంతం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నమిత అటుపై వెంకటేశ్ హీరోగా వచ్చిన జెమిని చిత్రంలో నటించింది. ఈ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాల్లోనూ నమిత హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ చిత్రాలేవీ నమితకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఐరన్‌లెగ్‌గా ముద్రపడిన నమిత తమిళ తెరవైపు వెళ్లిపోయింది. ఈ సమయంలో నమిత బొద్దుగానూ తయారైంది. అయితే బొద్దుగా ఉన్న నమితకు తమిళ సినీ పరిశ్రమలో మాత్రం అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలా ప్రారంభంలో విఫలమైన నమిత అటుపై తాను అనుకున్నది సాధించగలగడం గమనార్హం.

ఇలా పడిలేచిన కెరటంలా కెరీర్‌ను కొనసాగిస్తున్న నమిత పుట్టినరోజైనా మే 10కి వర్తించే వృషభరాశి ప్రకారం అదృష్టవంతురాలిగా చెప్పవచ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్న కాస్త స్వయంకృషి, దానికి తోడు అదృష్టం కలిసిరావడంతో నమిత హీరోయిన్‌గా సినీ పరిశ్రమలో నిలబడగలిగింది. వృషభరాశిలో జన్మించిన నమితకే కాక ఈ రాశిలో జన్మించినవారికీ నమితకు వర్తించే అంశాలు వర్తిస్తాయని చెప్పవచ్చు.

ఈ రాశిలో జన్మించినవారు స్వతహాగా శాంత స్వరూపులుగా ఉంటారు. ఎదుటివారిపై విరుచుకుపడే విధంగా వీరు ఏనాడూ ప్రవర్తించరు. అలాగే ఎక్కువ తెలివితేటలు లేకున్నా వీరికున్న ఆకర్షణశక్తితో సంఘంలో కొంత పలుకుబడి సాధిస్తారు. అయితే వీరి స్వభావం మాత్రం ఎదుటివారికి ఎప్పుడూ మిస్టరీగానే ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో వీరిని ఎదుటివారు కొంత తప్పుగానే అర్థం చేసుకుంటారు. అయితే అనుకున్న లక్షం చేరుకునే దిశగా విజయం సాధించేవరకు ఎదురుచూడగల ఓపిక ఉండడం వీరికి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అందాల అరుంధతి... అనుష్క
అందరికీ ఇష్టం... తమన్నా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
భారత ప్రధాని మన్మోహన్ సింగ్
సురేష్ రైనా
రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
20 నుంచి రవితేజ చిత్రం రెగ్యులర్ షూటింగ్
రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఆంజనేయులు.
షూటింగ్ పూర్తి చేసుకున్న జగన్మోహిని
మార్కెట్‌లోకి ఊహాచిత్రం ఆడియో విడుల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...