|
| అందాల అరుంధతి... అనుష్క |
| శుక్రవారం, 27 మార్చి 2009 ( 15:45 IST ) | |
పుట్టిన తేది: నవంబర్ 7, 1981 అదృష్ట సంఖ్యలు: 3, 7, 9 తాజాగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అరుంధతిగా స్థానం సంపాదించుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున హీరోగా 2005లో వచ్చిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అటుపై కొద్దికాలానికే అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకోవడం విశేషం.
సూపర్ తర్వాత అగ్రశ్రేణి కథానాయుకులతో నటించిన అనుష్క తాజాగా అరుంధతి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి తనవైపు ఆకర్షించింది. చక్కని రూపం, నిలువెత్తు విగ్రహం కలిగిన అనుష్క కేవలం తెలుగులోనే కాక తమిళంతో సహా ఇతర భాషల్లోనూ తన హావా కొనసాగిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో నవంబర్ 7, 1981లో జన్మించిన అనుష్క సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ముందు యోగా టీచర్‌గా పనిచేయడం విశేషం.
యోగా టీచర్‌గా పనిచేస్తున్న అనుష్కను చూచిన సూపర్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయడం అటుపై ఆమె టాలీవుడ్‌లోనే అగ్రశ్రేణి కథానాయకగా మారడం చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం అరుంధతిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన అనుష్క త్వరలోనే ప్రభాష్‌తో కలిసి బిల్లా చిత్రంలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసేందుకు సిద్ధమవుతోంది.
అనుష్క కెరీర్‌ను ఒకసారి గమనిస్తే ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. ప్రారంభ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించినా, ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా తొలి చిత్రంలోనే అనుష్క తన సత్తాను నిరూపించుకోగలిగింది. అందుకే అటుపై తెలుగులోనే కాక తమిళంలోనూ తన హావా కొనసాగించగలిగింది. ఇక ప్రస్తుతమున్న సీనియర్ హీరోల పక్కన జోడీ కట్టాలంటే అనుష్కకే దర్శకులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
ఇలా అనుష్క సినీ పరిశ్రమలో రోజురోజుకూ ఉన్నత శిఖరాలను అందుకోవడం గమనార్హం. అనుష్కలో ఇప్పటివరకు చెప్పుకున్న లక్షణాలన్నీ ఆమె పుట్టిన తేదీకి సంబంధించిన రాశి అయిన వృశ్చికరాశిలో పుట్టినవారికి సైతం వర్తిస్తాయి. ఈ రాశిలో పుట్టినవారు మొదటినుంచి అన్ని విషయాల్లో చలాకీగా ఉంటారు. అలాగే చిన్నతనం నుండే ఏదో ఓ రంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. అంతేకాకుండా నచ్చినరంగంలోనే కాక ఏ రంగంలో అడుగుపెట్టినా వీరికి విజయం తథ్యం.
అయితే చూచేవారికి వీరు కాస్త గర్వం కలిగిన స్వభావులుగా అనిపించవచ్చు. విలక్షణమైన వీరి రూపం సైతం వీరిని అందరిలోకి ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల వీరి ఉన్నతి చూచి కొందరు ఈర్శ పడే అవకాశముంది. శత్రువులపై ఓ కన్నైసి కెరీర్‌లో ముందుకు కొనసాగగలిగితే వీరికి అపజయమన్నమాటే ఉండదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|