యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
అందరికీ ఇష్టం... తమన్నా
శుక్రవారం, 13 మార్చి 2009   ( 15:55 IST )
Tamanna
PC
పుట్టినతేది: డిసెంబర్ 21, 1989.
అదృష్ట సంఖ్యలు: 2, 4, 7.
సినీరంగంలో పేరు సాధించాలంటే అదృష్టం కావాలంటారు. అందుకే ఈ రంగంలోకి ప్రవేశించినవారిలో అతికొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానానికి చేరుకోవడం జరుగుతుంటుంది. ఇలా కొంచెం అదృష్టంతోపాటు తన అందం, నటనతో కొద్దికాలంలోనే హీరోయిన్‌గా మంచి స్థానానికి చేరుకున్న నటి తమన్నా. చిన్నవయసులోనే హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తెలుగుతోపాటు తమిళంలోనూ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తోంది.

తరుణ్, త్రిష జంటగా తమిళంలో వచ్చిన ఎనక్కు 20, ఉనక్కు 18 చిత్రంలో త్రిష స్నేహితురాలిగా నటించిన తమన్నా అటుపై ఓ హిందీ చిత్రంలో నటించింది. అటుపై తమిళంలో కేడీ చిత్రంలో నటించింది. దీని తర్వాత తెలుగులో శ్రీ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రాలేవీ తమన్నాకు సరైన గుర్తింపును తెచ్చిపెట్టలేదు. వీటి తర్వాత తమిళంలో వచ్చిన కళ్లూరి అనే చిత్రంతో తమన్నాకు ఒక్కసారి టైం కలిసివచ్చింది.

ఈ చిత్రంతో తమన్నాకు తమిళంలో అవకాశాలు పెరిగి బిజీగా మారింది. అదేసమయంలో తెలుగులో కాళిదాసు చిత్రంలో నటించిన తమన్నా తాజాగా కొంచెం ఇష్టం... కొంచెం కష్టం చిత్రంతో అందరి అభిమాన హీరోయిన్‌గా మారింది. కొద్దిరోజుల్లో ఆనందతాండవం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్న తమన్నా కెరీర్‌ను పరిశీలిస్తే కొంచెం ఆశ్చర్యం కలగకమానదు.

బాగా చిన్నవయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తమన్నా తన అవకాశాల కోసం ఓపిగ్గా ఎదురుచూసింది. ఆలోపు వ్యాపారప్రకటనల్లో కనిపించిన తమన్నా ఆ పరిశ్రమలోనూ మంచి మార్కులు కొట్టేసింది. మంచి రంగుతో, అందంతో అందరినీ ఆకట్టుకునే రూపంతో ఉన్న తమన్నా గొప్ప హీరోయిన్‌గా పేరుతెచ్చుకునే రోజులు మరెంతో దూరంలో లేదనిపిస్తుంది.

ఎంతపేరు వచ్చినా అణుకవతో తన కెరీర్ గురించి మాత్రమే ఆలోచించడం తమన్నాకు ఫ్లస్ పాయింట్. తమన్నాలో కన్పించే ఈ లక్షణాలు ఆమె పుట్టిన తేదీ డిసెంబర్ 21కి సంబంధించిన రాశి అయిన ధనూరాశిలో జన్మించినవారందరిలోనూ కన్పిస్తాయి. ఈ రాశిలో జన్మించినవారు స్వతహాగా కాస్త అదృష్టవంతులనే చెప్పవచ్చు.

వీరి కష్టానికి అదృష్టం కూడా జతకావడంతో వీరు కెరీర్‌లో తక్కువ రోజుల్లోనే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. ఆకట్టుకునే రూపం, అందరికీ నచ్చే వీరి స్వభావం వీరికి అదనపు లాభం. అయితే పొగడ్తలకు పడిపోకుండా, అహంకారాన్ని వెంటతెచ్చుకోకుండా ఉంటే వీరు పురోగతి నల్లేరుమీద నడకే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
భారత ప్రధాని మన్మోహన్ సింగ్
సురేష్ రైనా
రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్
టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా
తరగని అందానికి చిరునామా త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఉగాది కానుకగా "ఆనందతాండవం"
"హ్యాపీడేస్" ఫేమ్ తమన్నా ప్రధాన పాత్రలో, ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్రనిర్మాత వి.రవిచంద్రన్...
మార్చి 20న ప్రేక్షకుల ముందుకు టార్గెట్
రెండు పాటలు మినహా ప్రభాస్ 'బిల్లా' పూర్తి
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...