|
| రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ |
| శుక్రవారం, 13 ఫిబ్రవరి 2009 ( 15:26 IST ) | |
పుట్టిన తేది: జూన్ 11, 1947 అదృష్ట సంఖ్యలు: 3, 5, 7 భారతీయ రైల్వేను లాభాల పట్టాలు ఎక్కించిన ఘనుడిగా కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పేర్కొనవచ్చు. రైల్వేలలో టికెట్ ధరను ఏమాత్రం పెంచకుండా ఇతరత్రా మార్గాల ద్వారా లాభాలను గడించే విధానాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత ఒక్క లాలూకే దక్కుతుంది.
బీహార్ ముఖ్యమంత్రిగా దాదాపు ఏడేళ్లు పాలించిన లాలూ అనంతరం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం (13-02-09) రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన లాలూ గత ఐదేళ్లలో రైల్వేకు 90 వేల కోట్లు మిగులును సృష్టించి రికార్డు సాధించారు.
బీహార్ స్వస్థలంగా జూన్ 11, 1947లో జన్మించిన లాలూ చిన్ననాటినుంచే అనుకున్నది చేసే వ్యక్తిగా ఎదగడంతోపాటు మంచి చమత్కారిగానూ పేరుతెచ్చుకున్నారు. ఈ లక్షణాలే అనంతరం కాలంలో ఆయనను తిరుగులేని రాజకీయ నేతగా మార్చడంతో పాటు బీహార్ సింహాసనాన్ని అదిష్టించేలా చేసింది. సమోసాలో ఆలూ ఉన్నంతవరకు బీహార్‌లో లాలూ పదవిలో ఉంటాడు అని చెప్పుకునే లాలూ కొద్దేళ్ల క్రితం దానా కుంభకోణంలో పెను విమర్శలు ఎదుర్కున్నారు.
అయితే ఆ కుంభకోణం నుంచి బయటపడిన అనంతరం లోక్‌సభకు ఎన్నికై ప్రస్తుతం రైల్వే మంత్రిగా పదవి నిర్వహిస్తున్నారు. లాలూ గతంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడేటప్పుడు తాను అధికారంలోకి వస్తే బీహార్ రహదారులను హేమమాలిని బుగ్గలంత నున్నగా చేస్తానని చెప్పేవారు. ఆయనలోని చమత్కారానికి ఈ వ్యాఖ్య ఓ ఉదాహరణ మాత్రమే.
ఈవిధంగా ఎన్నో విలక్షణ అంశాలను కలిగిన లాలూను ఓసారి పరిశీలిస్తే ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పెద్దగా చదువుకోకున్నా రాజకీయాల్లో విశేషంగా రాణించడం లాలూ సొంతం. అలాగే ఎన్ని విమర్శలు వచ్చినా తను అనుకున్నదే చేయాలనే పట్టుదల లాలూ సొంతం. అంతేకాదు తన రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం తొట్రు పడకుండా వాటినన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు వారిమీదే తన చతురోక్తులను విసరగల దిట్ట.
లాలూలో కన్పించే ఈ లక్షణాలన్నీ మిధునరాశి(మే 21- జూన్ 21)లో జన్మించినవారందరిలోనూ దాదాపుగా కన్పిస్తాయి. ఈ రాశిలో జన్మించినవారు చిన్ననాటినుంచే చాలా చురుకుగా ఉంటారు. ఏవిషయాన్నైనా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరికి వీరేసాటి. అదేసమయంలో వీరిలోని పట్టుదల కొన్ని సమయాల్లో ఎదుటివారి విమర్శలకు గురవడంతోపాటు చూచేవారికి వీరిది మూర్ఖత్వంలాగా అనిపిస్తుంది.
అయితే ఎవరేమీ అనుకున్నా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం వీరి బలం. అయితే ఈ బలమే కొన్ని సమయాల్లో బలహీనంగానూ పరిణమిస్తుంది. ఎదుటివారు కోపంతో అంతెత్తున లేస్తున్నా చిరునవ్వుతో సమాధానం చెప్పగల నేర్పరులు వీరు. మొత్తంగా జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించగల సామర్థ్యం వీరి సొంతం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|