|
| టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా |
| శుక్రవారం, 6 ఫిబ్రవరి 2009 ( 15:59 IST ) | |
పుట్టిన తేదీ: నవంబర్ 15, 1986 అదృష్ట సంఖ్యలు: 4, 7, 9 ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న టెన్నిస్ తార సానియా మీర్జాకు పరిచయాలు అక్కర్లేదు. భారత్‌లోని టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరుగానే కాకుండా అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ సానియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
నవంబర్ 15, 1986లో ముంబయిలో జన్మించిన సానియా చిన్ననాటి నుంచే టెన్నిస్ బ్యాట్ చేతబట్టి ప్రయోగాలకు సిద్ధమైంది. దాదాపు 17ఏళ్ల ప్రాయంనుంచే టెన్నిస్ మ్యాచ్‌లు ఆడుతున్న సానియా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించింది తక్కువైనా భారత్‌లో టెన్నిస్ క్రేజ్‌కు తానూ ఒక కారణంగా నిలిచింది. అంతర్జాతీయ టోర్నీల్లో అడుగుపెట్టిన తర్వాత ఇటీవలి కాలంలో సానియా తన కెరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.
మణికట్టు గాయంతో కొన్నాళ్లు ఆటకు దూరమైన సానియా తాజాగా చేసిన పునఃప్రవేశంతోనే మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెల్చిన తొలి భారతీయురాలిగా సానియా రికార్డు సృష్టించింది. సానియా కెరీర్‌ను పరిశీలిస్తే ప్రారంభంనుంచీ ఎత్తు పల్లాలతోనే సాగింది. అయినా సానియాకు వచ్చినన్ని పేరు ప్రఖ్యాతులు ఏ భారత టెన్నిస్ క్రీడాకారిణికి రాలేదంటే అతిశయోక్తి కాదు.
ఇలా అందంతోనూ, ఆటతోనూ ఆకట్టుకున్న సానియాను గమనిస్తే ఎలాంటి ఒడిదుడుకుల్లోనైనా స్థిరంగా ఉండగలిగే ఓ గొప్ప లక్షణం కన్పిస్తుంది. అలాగే ఎవరెన్ని విమర్శలు చేసినా తనకంటూ నచ్చినదాన్నే నమ్మే లక్షణం కూడా సానియా సొంతం. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోయి, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోయే తత్వం సానియాలో మచ్చుకైనా కన్పించదు.
సానియాలో కన్పించే ఈ లక్షణాలన్నీ సానియా పుట్టిన తేదీ అయిన నవంబర్ 15న జన్మించినవారందరికీ దాదాపుగా వర్తిస్తాయి. ఈ తేదీలో పుట్టినవారు చిన్ననాటినుంచే తమకు ఇష్టమైన రంగంలోనే ఎదగాలనే కోరికను పెంచుకుంటారు. వీరికి చిన్ననాటి నుంచీ అదృష్టం తోడుగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు తమ జీవితంలో ఒక పరిధి మేరకు రాణిస్తే వీరికి తోడున్న అదృష్టం మరింత గుర్తింపును తెచ్చిపెడుతుంది.
అయితే వీరిలో ఉన్న ఆత్మ విశ్వాసం ఎదుటివారికి పొగురుగా కన్పించే అవకాశముంది. అందుకే వీరిని చూచినవారు వీరికున్న మంచి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. పైపెచ్చు వీరిపై విమర్శలు ఎక్కుపెడుతారు. అయితే ఎవరెన్ని అనుకున్నా లక్ష్యపెట్టక ముందుకు సాగే గుణమే వీరికి శ్రీరామరక్షగా తోడుంటుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|