యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
సూపర్‌స్టార్ రజనీకాంత్
శుక్రవారం, 9 జనవరి 2009   ( 15:40 IST )
Rajnikanth
PC
పుట్టిన తేది: డిసెంబర్ 12, 1950
అదృష్ట సంఖ్యలు: 1, 9, 10, 18, 19, 27, 28
భారతీయ చలనచిత్ర రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాధించుకన్న అతికొద్దిమంది నటుల్లో రజనీకాంత్ ఒకరు. తమిళ చిత్రాల ద్వారా నటుడిగా సినీరంగ ప్రవేశం చేసినా తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకోవడమేకాక ఇతర దేశాల్లోనూ అభిమానులను సంపాధించుకోవడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లింది.

రజనీకాంత్ సినిమా విడుదల కాబోతోందంటే ఆయన అభిమానులకు అది ఓ పండుగలాంటిదే. నటుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన రజనీకాంత్ వ్యక్తిగానూ అందరిచేత శబాష్ అనిపించుకున్నారు. తెరపైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ పదిమందికి సాయపడాలనే మంచి గుణం కల్గిన స్వభావం రజనీకాంత్‌ది.

అందుకే నిజజీవితంలో ఆయన అనేకమందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయపడ్డారు. ఇటీవల విడుదలైన శివాజీ చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన రజనీ అటుపై వచ్చిన కథానాయకుడు చిత్రంతోనూ అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇటీవలే డిసెంబర్ 12వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని గమనిస్తే మంచితనం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణం, ఎంత గొప్ప స్థితికి చేరినా గర్వం లేని నైజం, ఎంత ధనవంతుడైనా సాధాసీదాగా ఉండగల్గడం లాంటి గొప్ప లక్షణాలెన్నో కన్పిస్తాయి.

రజనీకాంత్‌లో కన్పించే ఈ లక్షణాలన్నీ కేవలం ఆయనలోనే కాక డిసెంబర్ 12న జన్మించిన చాలామందిలోనూ కన్పిస్తుంది. ఈ తేదీన పుట్టినవారు స్వతహాగా తాము నమ్మినదాన్నే చేయాలనే ధృడ సంకల్పాన్ని కల్గిఉంటారు. ఈ తేదీన జన్మించినవారికి దైవ భక్తి మెండుగా ఉంటుంది. వీరి కష్టానికి తోడు అదృష్టం సైతం వెంటే ఉంటుంది. అందువల్ల వీరు జీవితంలో ఉన్నతస్థితిని దాదాపు సులభంగానే చేరుకుంటారు.

అదేసమయంలో ఎంత ఉన్నతస్థితిని చేరినా గర్వం లేకుండా ఉండగల్గడం వీరి స్వభావంగా ఉంటుంది. ఈ లక్షణం సైతం వీరి అభివృద్ధికి తోడ్పడుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హోం మంత్రి పి. చిదంబరం
భారీ బడ్జెట్ హిట్ చిత్రాల దర్శకుడు శంకర్
బరాక్ ఒబామా
వైఎస్ రాజశేఖరరెడ్డి
ఇలియానా
విక్టరీ వెంకటేష్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...