|
| విక్టరీ వెంకటేష్ |
పుట్టినరోజు: డిసెంబరు 13, 1960 అదృష్ట సంఖ్యలు: 1, 4 విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమారుడిగా 1986లో (కలియుగ పాండవులు) చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన వెంకటేష్, ప్రస్తుతం టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అభిమానులు ఆయనను ముద్దుగా వెంకీ అని పిలుస్తారు.
చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మీ తదితర హిట్ చిత్రాల్లో నటించిన విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు 57 సినిమాల్లో నటించారు. ఆయనను ఆరుసార్లు నంది అవార్డులు కూడా వరించాయి. ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసుందాం రా చిత్రాలు ఆయనకు ఈ అవార్డులు తెచ్చిపెట్టాయి.
ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉండే వెంకీ స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటారు. మంచి హాస్యచతురతతోపాటు, నిజాయితీగా వ్యవహించడం ఆయనకు ఇష్టం. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయనలో సృజనాత్మకత, ఆయన మాటల్లో ఫిలాసఫీ కనిపిస్తుంటాయి. గుడ్డిగా నమ్మేతత్వం, విశ్రాంతి లేకుండా జీవించడం ఆయన బలహీనతలుగా చెప్పుకోవచ్చు.
ఈ లక్షణాలు విక్టరీ వెంకటేష్‌తోపాటు నవంబరు 23- డిసెంబరు 21 మధ్య పుట్టిన ధనస్సు రాశి వారందరకీ వర్తిస్తాయి. ఈ రాశి వ్యక్తులు ప్రయాణాలను బాగా ఇష్టపడుతుంటారు. నమ్మకాలు, సిద్ధాంతాలంటూ కూర్చోవడం వీరికి నచ్చదు. పరిమితుల్లో ఉండేందుకు కూడా ఇష్టపడరు. అందరినీ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| వాస్తు - ఇంటి నిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంపిక చేసుకోవాలో భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. |
| |
|
|
|
|
|
|
|