|
| నారా చంద్రబాబు నాయుడు |
పుట్టినతేదీ: ఏప్రిల్ 20, 1950 అదృష్టసంఖ్యలు: 2, 9 రాష్ట్ర రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును తెలుగు ప్రజానీకానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1995- 2004 మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు. రాష్ట్రానికి ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఇప్పటివరకు చంద్రబాబు ఒక్కరికే దక్కింది.
రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశానికి అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం చంద్రబాబు ప్రజలకు రాజకీయ సేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున 1978లో ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ఆయన మామ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడం చంద్రబాబు ప్రత్యేకత. ధైర్య, సాహసాలు మెండుగా కలిగివుండటం ఆయనకు అదనపు భూషణాలు. ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. మంచి సమయస్ఫూర్తి కలిగివుంటారు. ఈ లక్షణాలు చంద్రబాబుతో పాటు మార్చి 21- ఏప్రిల్ 20 మధ్య పుట్టిన మేష రాశివారందరికీ వర్తిస్తాయి.
ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమవడం వీరికి ఇష్టం. అంతేకాకుండా అన్నింటిలోనూ ముందుండటానికి ప్రయత్నిస్తారు. సవాళ్లును ధైర్యంగా ఎదుర్కోవడానికి మక్కువ చూపుతారు. ఓటమిని అంగీకరించాడనికి ఈ రాశి వ్యక్తులు అంత తొందరగా ఇష్టపడరు. ఇతరుల సలహాలను తీసుకోవడానికి కూడా మేషరాశి వారు సమ్మతించరు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | మల్లెపువ్వు రివ్యూ | | "మల్లెపువ్వు" చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకుని... |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - గాంధీ- నెహ్రూ కుటుంబం దేశానికి అందించిన మరో రాజకీయ నేత రాహుల్ గాంధీ. |
| |
|
|
|
|
|
|
|