|
| రాహుల్ గాంధీ |
పుట్టినరోజు: జూన్ 19, 1970 అదృష్టసంఖ్యలు: 1, 4 గాంధీ- నెహ్రూ కుటుంబం దేశానికి అందించిన మరో రాజకీయ నేత రాహుల్ గాంధీ. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ముద్దులబిడ్డే రాహుల్. ఈ యువనేత గత ఏడాది సెప్టెంబర్ 24న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో అతితక్కువ సమయంలోని పార్టీలో కీలక హోదాను దక్కించుకున్నారు.
రాజీవ్ గాంధీ రాజకీయ ప్రవేశం గురించి 2003లో మీడియాలో జరిగిన భారీ ప్రచారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా ఏడాదిపాటు మీడియాలో వినిపించిన ఊహాగానాలకు తెరదించుతూ.. మార్చి 2004లో రాహుల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనంతరం మే- 2004 ఎన్నికల్లో తండ్రి పోటీ చేసిన అమేథి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
సర్దుకుపోవడం, బహుముఖ ప్రజ్ఞ, కలుపుగోలుతనం, హాస్య చతురత, తెలివితేటలు, మంచి వాగ్ధాటి, చురుకైన స్వభావం రాహుల్ గాంధీ లక్షణాలు. సమస్యలను ఎదుర్కోగల ధైర్యం రాహుల్‌లో మెండు. భావాలను నిర్భయంగా వ్యక్తీకరిస్తారు. ఎప్పుడు యువకుల మాదిరిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్లడం ఆయన నైజం. జీవితాన్ని విభిన్నంగా ఉంచుకోవడానికి, అసాధారణంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.
ఈ లక్షణాలు ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే కాకుండా.. మే 22- జూన్ 21 మధ్య జన్మించిన మిథున రాశి వారందరికీ వర్తిస్తాయి. ఈ రాశివారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. కొత్తదనం కోసం పరితపిస్తుంటారు. వైవిధ్యం కోసం ఆరాటపడుతుంటారు. ఒకే సమయంలో అనేక పనులు చేయడానికి కూడా వీరు మక్కువ చూపుతారు. మందకొడిగా ఉండటం, ఒంటరిగా ఉండటమంటే ఈ రాశి వ్యక్తులకు చిరాకు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | బలహీనమైన కథతో సరోజ | | కిడ్నాప్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన చిత్రం సరోజ. కథాగమనాన్ని... |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - ఎల్‌కే అద్వానీ.. దేశ రాజకీయాల గురించి ఏకాస్త తెలిసిన వారికైనా పరిచయం చేయాల్సిన అవసరం... |
| |
|
|
|
|
|
|
|