|
| బాలకృష్ణ |
పుట్టినరోజు: జూన్ 10, 1960 అదృష్ట సంఖ్యలు: 1, 5, 7
నందమూరి తారక రామారావు వారసునిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి వచ్చిన బాలకృష్ణ అనతికాలంలోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సినిమాలకు ఉన్న అశేష ప్రేక్షకకాదరణ అందరికీ తెలిసిందే. 30 ఏళ్లకుపైబడిన నటనానుభవంతో టాలీవుడ్‌లో ఒక టాప్ స్టార్‌గా కొనసాగుతున్న బాలయ్య గురించి ఎంత పరిచయం చేసినా తక్కువగానే అనిపిస్తుంది.
సమస్యలను ఎదుర్కోగల ధైర్యం, అన్నిరకాలుగా చొరవచూపేతత్వం, భావ వ్యక్తీకరణ, సరదాగా ఉండటం బాలయ్య లక్షణాలు. మేథో నైపుణ్యం, వాగ్ధాటి కూడా యువరత్నకు అదనపు భూషణాలు. యువకుల్లో ఉండే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్లడం ఆయన నైజం. జీవితాన్ని విభిన్నంగా ఉంచుకోవడానికి, అసాధారణంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.
ఈ లక్షణాలు ఒక్క బాలకృష్ణకు మాత్రమేకాకుండా.. మే 22- జూన్ 21 మధ్య జన్మించిన వారందరికీ వర్తిస్తాయి. ఈ రాశి వ్యక్తులు మంచి వాగ్ధాటి కలిగివుంటారు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. ఒకే సమయంలో అనేక పనులు చేయడానికి కూడా మక్కువ చూపుతుంటారు. పుస్తకాలు చదవడం వీరి హాబీ.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - భారతీయ వాస్తు శాస్త్రాలు మెట్లను నిర్మించటంలోనూ కొన్ని పద్ధతులను పాటించాలని తెలుపుతున్నాయి. |
| |
|
|
|
|
|
|
|