|
| ఏ.ఆర్.రహమాన్ |
పుట్టిన తేదీ: జనవరి 6 అదృష్ట సంఖ్యలు: 4,6,7
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ సినీ పరిశ్రమకు పరిమితంకాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్. మనసును ఆనందంలో ముంచెత్తే సంగీతాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎబ్బెట్టుగా లేకుండా సంగీతంతో మనసుకు ప్రశాంతతను అందిచడం రెహమాన్కు వెన్నతోపెట్టిన విద్య. పాశ్చాత్య సంగీతం, శాస్త్రీయ సంగీతం దేనితోనైనా సంగీతాభిమానులను ఉర్రూతలూగించడం రెహమాన్కు తెలుసు.
సినిమా పాటలతోనే కాకుండా దేశభక్తి గీతాలు, ఆల్బంలు ఆయనకు అశేష అభిమాన ఆదరణను సంపాందించిపెట్టాయి. సంగీతంతో అందరికీ సుపరిచితమైన రెహమాన్కు చక్కని సంగీతం వినడం, కొత్త బాణీలను సృష్టించేందుకు సాధన చేయడం హాబీలు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని భావించే రెహమాన్ ఇందుకోసం చాలా కష్టపడుతుంటాడు. ఎంతటి కష్టమెదురైనా కన్నీళ్లు పెట్టడాన్ని ఇష్టపడరు.
కొన్ని సందర్భాల్లో వ్యతిరేక కోణంలో ఆలోచించే అలవాటు ఉన్నా, అనుకున్నది సాధించేంత వరకు వెనకడుగు వేయరు రహమాన్. చూసేందుకు రిజర్వ్డ్గా కనిపించే ఈయనతో సన్నిహితంగా స్నేహం చేస్తే మాత్రం అమ్మో అనిపిస్తుంది. ఈ లక్షణాలు రహమాన్కు మాత్రమే కాక, ఈ రాశిలో జన్మించిన వారందరికీ వర్తిస్తాయి.
ఈ రాశివారికి గత రెండు నెలల్లో ఏర్పడిన సమస్యలు మెల్లగా పరిష్కారం అవతాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|