|
| స్నేహా ఉల్లాల్ |
పుట్టిన రోజు: డిసెంబర్ 18, 1987 అదృష్ట సంఖ్యలు: 4,6
అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మస్కట్ పుట్టిన ఈమె తల్లిదండ్రులు భారతీయులే. ఈమె తన విద్యాభ్యాసాన్ని కాస్త మస్కట్‌లో మిగతాది భారత్‌లో పూర్తి చేసింది. ఆ సమయంలో బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరితో స్నేహం ఏర్పడింది. తద్వారా తొలి చిత్రం లక్కీ ద్వారా పరిశ్రమలో అడుగుపెట్టింది.
అనంతరం తెలుగులో ఉల్లాసంగా, ఉత్సాహంగాలో నటించి అందరినీ మెప్పించింది. అధికంగా దైవ భక్తి కలిగిన ఈమె అందరితో స్నేహంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రతి విషయాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తుంది. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పోలిన కళ్లు ఈమెకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అలాగే చిరు కోపం ఈమెకు ఆటంకాలుగా ఉంటాయి.
జీవితంలోని ముఖ్య ఘట్టాలలో విజయాలు సాధిస్తారు. అయితే మనసులో గర్వాన్ని రానివ్వకుండా చూసుకోవాలి. ఇతరులు, స్నేహితులు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే తన వంతు సాయం చేసే గుణం ఈమె సొంతం. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి. ఇతరులపై ప్రేమను కురిపించడం, తప్పులను క్షమించగలిగే గుణాలు వీరికి వెన్నతో పెట్టిన విద్య. స్విమ్మింగ్, పుస్తకాలు చదవడం వీరి హాబీలు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|