|
| మమతామోహన్‌దాస్ |
పుట్టిన రోజు: ఆగస్ట్ 5, 1985 అదృష్ట సంఖ్యలు : 4,5,6
గాయనిగా తన స్వరాలతో, నటిగా సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్న మలయాళ భామ మమతా మోహన్‌దాస్. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించి తన ప్రతిభను చాటుకుంది. మలయాళంలో పలు హిట్ చిత్రాలలో నటించి తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశించిన మమతా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకుంది.
తెలుగు చిత్రం రాఖీలో రాఖీ రాఖీ, శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఆకలేస్తే అన్నం పెడతా, యమదొంగ చిత్రంలో ఒలమ్మీ తిక్కరేగిందా, జగడం చిత్రంలో 36 24 36 వంటి హిట్ పాటలు పాడి గాయనిగా అందరి మనసులను దోచుకుంది. యమదొంగ చిత్రంలో నటించడం ద్వారా తన నటన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆమె కర్నాటిక్, హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందింది. అందరిపైనా ఇట్టే అభిమానం పెంచుకునే గుణం కలిగిన మమత కొన్ని విషయాల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంది. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ఇండోర్ గేమ్స్ ఆడడం అంటే ఈమెకు చాలా ఇష్టమైన పనులు. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో జన్మించిన అందరికీ వర్తిస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|