|
| ఆర్తీ అగర్వాల్ |
ఆర్తీ అగర్వాల్ పుట్టిన రోజు : మార్చి 5 అదృష్ట సంఖ్యలు : 5,8,9
అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా ప్రేక్షకులను తొందరగానే ఆకర్షించింది. గుజరాతీ కుటుంబంలో పుట్టిన ఆర్తీ అగర్వాల్ అమెరికాలో పుట్టిపెరిగింది. మొదట బాలీవుడ్ జనాలకు పరిచమయిన ఈ గుజరాతీ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించేసింది.
ఆర్తీ మొదట పాగల్‌పన్ (హిందీ) అనే చిత్రంలో నటించింది. అది ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత విజయ భాస్కర్ దర్శకత్వంలో తెలుగులో నువ్వునాకునచ్చావ్ చిత్రంలో వెంకటేష్ సరసన నటించి అందరి మనసులు దోచుకుంది. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ఇంద్ర, వసంతం, నేనున్నాను, అడవి రాముడు, సంక్రాంతి, అందాల రాముడు తదితర హిట్ చిత్రాల్లో నటించింది.
ఇటీవలే ఓ పారిశ్రామికవేత్తను వివాహమాడిన ఈ భామ తాజాగా చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందుతున్న గోరింటాకు చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ సరసన నటిస్తోంది. అందరినీ తన అమాయకపు నటనతో ఇట్టే ఆకర్షించే ఈమె నిజాయితీ ఉండే వారిని బాగా అభిమానిస్తుంది. అలాగే పేదవాళ్లకు సాయం చేయడమంటే కూడా చాలా ఇష్టం. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో జన్మించిన అందరికీ వర్తిస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|