|
| జూనియర్ ఎన్టీఆర్ |
| బుధవారం, 21 మే 2008 ( 14:32 IST ) | |
పుట్టిన రోజు :మే 20, 1983 అదృష్ట సంఖ్యలు : 4,5,6
బాలనటుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే తాత వంటి పేరు ప్రఖ్యాతలను సంపాదించిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. తాత అయిన నందమూరి తారకరామారావు రూపురేఖలను పోలి ఉండే మనవడు ఎన్టీఆర్. బాలరామాయణంలో నటించి అందరినీ మెప్పించాడు.
ఆ తర్వాత నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా ఎన్టీఆర్ పరిచయమయినప్పటికీ, ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు, ఆది, సింహాద్రి, సాంబ, నా అల్లుడు, రాఖీ, యమదొంగ, కంత్రి వంటి హిట్ చిత్రాలలో నటించి అందరి మనసులను దోచుకున్నాడు.
తాతయ్య వంటి మనస్తత్వం కలిగిన జూనియర్ ఎన్టీఆర్ మృదు స్వభావుడు. ఎవరి మనసు నొప్పించకుండా ఉండాలని భావిస్తాడు. మిత్రులతో సరదాగా గడపడమంటే చాలా ఇష్టపడతాడు. కష్టాలలో ఎవరినీ నిందించకుండా తానే జయించాలని అనుకునే స్వభావం కలిగినవాడు.
స్నేహితులతో పాటు శత్రువులు కూడా ఉండే ప్రమాదం ఉన్నందున కాస్త జాగ్రత్త పడడం అవసరం. క్రికెట్, బ్యాడ్మింటన్‌లు ఆడడమంటే ఇష్టం. సంగీతంలో రాక్ సంగీతంపై అమితాశక్తి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|