|
| నయనతార |
పుట్టిన రోజు: నవంబర్ 18 అదృష్ట సంఖ్యలు: 5,6,9
చంద్రముఖి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తార నయనతార. ఆ తర్వాత లక్ష్మి చిత్రంలో వెంకటేష్ సరసన నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అనతి కాలంలోనే బాస్, యోగి, తులసి, దుబాయ్ శీను తదితర చిత్రాలలో అగ్ర హీరోల సరసన నటించింది.
మలయాళం భామ అయినప్పటికీ, తెలుగు, తమిళ చిత్రసీమల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది నయనతార. గుండె ధైర్యం, చేసే పనిపై పూర్తి ఏకాగ్రత, చూపరులను ఇట్టే ఆకర్షించగల అందం వంటి అంశాలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. కెరీర్‌లో ముందుకెళ్లే దిశగా కాస్త అసూయ ఉండడం సహజమైన లక్షణం. అలాగే దగ్గిరవాళ్లతో తప్ప అందరితో అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడలేకపోవడం బలహీనతగా చెప్పవచ్చు.
నిజాయితీ, ఓర్పు, అన్ని విషయాలనూ నేర్చుకోవాలన్న తపన వంటి అంశాలు ఈమెకు చాలా ఇష్టం. నయనకే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ ఈ గుణాలు వర్తిస్తాయి. కేరీర్‌లో సాధించిన విజయాలను ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. అలాగే అసూయ గలవారితో జాగ్రత్తగా మెలగడం మంచిది.
జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి కోలుకుంటారు. ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. విదేశీ పయనాలను తప్పించడం సాధ్యం కాదు. ఇంట్లో సుఖ, సంతోషాలు ఉంటాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|