|
| అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్ | |
పుట్టిన తేదీ: ఆగస్టు 17, 1963 అదృష్ట సంఖ్యలు: 3, 7, 9
భారత చలనచిత్ర దర్శకుల్లో అత్యంత ప్రతిభావంతులుగా చెప్పుకోదగిన అతి కొద్దిమందిలో శంకర్‌ను కూడా చేర్చవచ్చు. సాధారణమైన కథకు సైతం అద్భుతాలను జోడించి భారతీయ సినిమాకు ప్రపంచ ఖ్యాతి అందించిన ఘనత శంకర్ సొంతం. శంకర్ రూపొందించే ప్రతి చిత్రం ప్రారంభం నుంచే అనేక అంచనాలకు కేంద్రంగా నిలిస్తే ఆ చిత్రాల్లో నటించే నటుల మార్కెట్ అమాంతంగా పెరిగిపోతుందంటేనే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఆగస్టు 17, 1963న తమిళనాడులోని ఓ పల్లెటూరిలో జన్మించిన శంకర్ తన విద్యాభ్యాసం తర్వాత చిత్రరంగానికి వచ్చారు. అర్జున్ కథానాయకుడుగా తమిళంలో రూపొందించిన జెంటిల్‌మెన్ చిత్రంతో దర్శకునిగా శంకర్ చిత్ర రంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రం అదే పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. ఆ చిత్రం సాధించిన అఖండ విజయంతో శంకర్ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఆయన తమిళ దర్శకుడైనా ఆయన ప్రతి చిత్రం తెలుగు, హిందీ భాషల్లోకి అనువదించబడి అక్కడ సైతం మెగా హిట్లు సాధించడం శంకర్‌కు మాత్రమే సొంతమైన ఓ అద్భుతం. జెంటిల్‌మెన్ చిత్రం తర్వాత ఆయన రూపొందించిన ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ తదితర చిత్రాలన్నీ బాక్సాఫీస్ హిట్టులే. అలాగే ఏ చిత్రానికి ఆ చిత్రం సంచలనాలని నమోదు చేసినవే.
అలాగే తాను రూపొందించే ప్రతి చిత్రంలో ఓ సామాజిక సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని చెప్పడం కూడా శంకర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రస్తుతం రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా రూపొందనున్న రోబో చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్న శంకర్ చిత్రరంగంలో మరెన్ని అద్భుతాలకు శ్రీకారం చుడుతారో వేచి చూడాలి.
చూడడానికి సింపుల్‌గా ఇతనేనా ఈ చిత్రాలకు దర్శకత్వం చేశాడు అనిపించేలా ఉండే శంకర్ ఎప్పుడూ పబ్లిసిటీని కోరుకోకపోవడం గమనార్హం. తాను చేసే పనిలో శ్రద్ధ, చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, సామాన్యుడు సైతం అర్థం చేసుకునేలా చెప్పే ప్రతిభ శంకర్ సొంతం. అదే సమయంలో తాను ఎంచుకున్న రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించడానికి నిరంతరం శ్రమించే గుణం కూడా శంకర్‌ని ఈనాడు అంతటి ఉన్నత స్థానంలో నిలిపాయి.
శంకర్‌కు చెప్పిన ఈ ప్రత్యేక గుణాలన్నీ ఆయన పుట్టిన తేదీ అయన ఆగస్టు 17న పుట్టిన వారికి సైతం వర్తిస్తాయి. ఈ తేదీన పుట్టిన వారు చూడడానికి మాత్రం అతి సామాన్యులుగా కన్పిస్తారు. కానీ తరచి చూస్తే వీరిలోని ప్రతిభాపాటవాలకు అంతే ఉండదు. అలాగే వీరు ఎప్పుడూ ఇతరుల మెప్పుకోసం ప్రయత్నించకుండా తాము చేయాలనుకున్న పనిలో ఎంతమేర విజయం సాధించామని మాత్రమే ఆలోచిస్తారు.
అలాగే తమకు లభించిన సంపదతో పదిమందికి ఉపయోగపడే కార్యాలు చేయాలనుకోవడం కూడా వీరికున్న ఓ గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. అయితే హంగు, ఆర్భాటలకు ప్రాధాన్యమిచ్చే వీరి ఆలోచనలు ఒక్కోసారి ప్రతికూలంగా పరిణమించవచ్చు. అలాగే అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనే వీరి ఆలోచనలు సైతం వీరికి కొంత నష్టాన్ని కలిగించకమానవు. కానీ కాస్త వాస్తవిక దృష్టితో ఆలోచించి కనుక వీరు పనులు చేయడం మొదలు పెడితే విజయం వీరి పాదాక్రాంతం కావాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|