|
| అందానికి అభినయం తోడు త్రిష | |
పుట్టిన తేది-- మే 4, 1983. అదృష్ట సంఖ్యలు-- 1, 4, 8, 9 తెలుగు, తమిళ సినీరంగంలో సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. అటు తమిళంలో రెగ్యులర్‌గా నటిస్తూనే తెలుగు తెరపై అప్పుడప్పుడు కన్పించే త్రిష నటించిన దాదాపు ప్రతి చిత్రం సూపర్‌హిట్‌గానే నిలిచింది.
తెలుగు, తమిళంలో తరుణ్ హీరోగా నిర్మించిన నీ మనస్సు నాకు తెలుసు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త్రిష అటుపై అనేక చిత్రాల్లో నటించారు. వర్షం, అతడు, పౌర్ణమి, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, స్టాలిన్, సైనికుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాల్లో నటించిన త్రిష తాజాగా రవితేజ హీరోగా ఈ ఏడాది ఘన విజయం సాధించిన కృష్ణ చిత్రంలో సైతం హీరోయిన్‌గా నటించింది.
కేవలం అందానికి, అంగాంగా ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా తాను నటించే చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూచుకునే అతి కొద్దిమంది హీరోయిన్లలో త్రిష ఒకరు. కేరళలోని పాలక్కాడ్‌లో 1983 మే 4న జన్మించిన త్రిష చిన్ననాటి నుంచే ఫ్యాషన్ ప్రపంచానికి దగ్గరయ్యారు.
ఫ్యాషన్ రంగం ద్వారా కెరీర్‌ను ప్రారంభించడం ద్వారా త్రిష ప్రారంభం నుంచి తన క్యాస్టూమ్స్ విషయంలో ఎప్పుడూ ఆధునికత ఉండేలా జాగ్రత్త వహిస్తారు. సినీ రంగంలో అశేష అభిమానులను సంపాదించుకున్న త్రిష వ్యక్తిగత జీవితంలోను ఆధునికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే తన ప్రవర్తనలోను ప్రత్యేకతతో ప్రవర్తించే త్రిష కొన్నిసార్లు వివాదాలకు కేంద్రంగా మారారు.
అయితే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ముందుకు సాగుతున్నారు. త్రిష పుట్టిన రోజైన మే 4వతేదీన పుట్టిన వారి గుణగణాలను పరిశీలించినట్టయితే త్రిషలోని కొన్ని లక్షణాలు సారూప్యం వారిలోనూ గోచరిస్తుంది. ఈ తేదీన పుట్టిన వారు ప్రధానంగా ఆధునీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అలాగే వ్యక్తిగత అలంకరణకు, ట్రెండ్‌కు తగ్గ దుస్తులు ధరించే విషయంలో ముందుంటారు. ఆధునికంగా కన్పించడానికి తాపత్రయపడే వీరు ఆ విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశముంది. అలాగే మానసికంగా వీరు కాస్త ఒంటరి స్వభావం ఉన్న వారు. తమ పని, తమ విషయాలు తప్ప పక్కవారి గురించి పట్టించుకోనటువంటి స్వార్థపూరిత స్వభావంతో ఉంటారు.
అయితే ఎదుటి వారికి హాని కలిగించాలని మాత్రం భావించరు. ఇతరులతో పెద్దగా కలవకపోయినా తమకు సన్నిహితమైన వారి సమక్షంలో మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తిస్తారు. ఇలాంటి స్వభావం వల్ల వీరు నమ్మినవారు మోసం చేసే రకమైతే వీరు చిక్కుల్లో పడే అవకాశముంది.
కాబట్టి ఈ తేదీలో పుట్టిన వారు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా చుట్టుపక్కల వారి గురించి కూడా ఆలోచించి అందుకు తగ్గట్టు నడచుకుంచే విజయాలు మరింత పరిపూర్ణంగా వీరిని వరిస్తాయని చెప్పవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|