యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
కమిలినీముఖర్జీ
- మునిబాబు
పుట్టిన తేదీ: మార్చి 4, 1980
అదృష్ట సంఖ్యలు: 3, 5, 8, 9
చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరోయిన్ కమిలినీ ముఖర్జీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హార్ట్ టచ్చింగ్ మూవీ ఆనంద్‌ సినిమాతో తొలిసారి తెరపై కన్పించి కమిలినీ నిజంగానే ప్రేక్షకుల హార్ట్‌ని టచ్ చేశారని చెప్పవచ్చు.

ఎక్స్‌పోజింగ్‌తో సినీరంగంలో స్థానం సంపాదించాలని ఆరాటపడే హీరోయిన్ల మధ్య చీరకట్టుతో సాంప్రదాయబద్ధంగా కన్పించిన కమిలినీ తొలి చిత్రంతోనే సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా మార్కులు కొట్టేశారు. అటుపై గోదావరి, హ్యీపీడేస్, గమ్యం లాంటి హిట్ చిత్రాలతో పాటు మరిన్ని చిత్రాల్లోను నటించారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా విడుదల కానున్న జల్సా చిత్రంలోను నటిస్తున్నారు.

మార్చి 4, 1980లో జన్మించిన కమిలినీముఖర్జీ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత చిత్రసీమలో ప్రవేశించారు. తెలుగు చిత్రం ద్వారా సినీ ప్రవేశం చేసిన కమిలినీ అటు తమిళ చిత్రాల్లోను బిజీ నటిగా కొనసాగుతున్నారు. చిత్రాల ఎంపికలో ఎంతో జాగ్రత్త వహించే కమిలినీముఖర్జీ తన పాత్ర విషయంలోను అంతే శ్రద్ధ కనబరుస్తారు.

ఆధునీకతను ప్రదర్శించే పాత్రలకు, వేషధారణకు తాను వ్యతిరేకిని కానని చెప్పే కమిలినీ అంగాంగ ప్రదర్శనకు మాత్రం తాను దూరమని స్పష్టంగా చెబుతారు. సినిమాలో తాను పోషించే పాత్రలకు, వ్యక్తిగత జీవితానికి పొంతన లేదని చెప్పే కమిలినీ సినిమాల్లో సాంప్రదాయ కట్టుబొట్టుతో దర్శనమిచ్చినా వ్యక్తిగతంగా మాత్రం మాడరన్ డ్రస్సులతోనే కన్పించడం విశేషం.

(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...