|
| విశాల్ | |
పుట్టిన తేదీ: ఆగస్టు 29 అదృష్ట సంఖ్యలు: 4, 6, 8 సినీరంగంలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న కొద్దిమంది నటుల్లో విశాల్ ఒకరు. తెలుగు తెరకు నేరుగా పరిచయం కాకపోయినా అనువాద చిత్రాల ద్వారా విశాల్ తెలుగులోను మంచి ఇమేజ్ సంపాదించారు.
తమిళంలో సండై కోళి అనే సినిమాతో తెరంగేట్రం చేసిన విశాల్ పందెం కోడి పేరుతో ఆ చిత్రం తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగువారికి సైతం పరిచయమయ్యారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇక విశాల్ తమిళంలో నటించిన అన్ని చిత్రాలు తెలుగులో అనువదించడం మొదలైంది.
ఆ కోవలో వచ్చిన పొగరు, భరణి, భయ్యా లాంటి చిత్రాలు సైతం మంచి విజయాన్ని నమోదు చేశాయి. విశాల్ తన సినీ ప్రస్థానాన్ని తమిళ రంగంలో ప్రారంభించినా ఆయన తెలుగువారు కావడం విశేషం. కాస్త చామనఛాయతో చూడగానే హ్యాండ్‌సమ్‌గా కన్పించే విశాల్ యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా నిరూపించుకున్నారు.
ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి తనకు బిడియమని చెప్పుకునే విశాల్ వ్యక్తిగతంగాను బిడియ స్వభావంతో ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాగే కాస్త కోపం ఎక్కువగా ప్రదర్శించడమే విశాల్ మైనస్‌గా ఆయనను ఎరిగినవారు అభిప్రాయపడుతుంటారు.
విశాల్ స్వభావమే కాక విశాల్ పుట్టన తేదీ అయిన ఆగస్టు 29న పుట్టిన వారి స్వభావాన్ని గమనించినపుడు దాదాపు ఇలాంటి లక్షణాలను మనం గుర్తించవచ్చు. ఈ తేదీన జన్మించినవారు సహజంగా బిడియ స్వభావులుగా గోచరిస్తారు. అయితే రంగంలోకి దిగితే మాత్రం వీరు పైకి కన్పించేంత మెతక మాత్రం కాదని తెలుస్తుంది.
బాగా సీరియస్‌గా కన్పించడమే కాక, దాదాపు అలాగే ప్రవర్తించే వీరిని చూస్తే వీరు బాగా రిజర్వ్డు టైప్ అని భావిస్తారు. కానీ ఈ తేదీలో జన్మించినవారు తమ ఫేస్‌లో కన్పించే సీరియస్‌ను పనిలో సైతం ప్రదర్శిస్తారు. అందువల్ల వీరు తలపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయనే చెప్పవచ్చు.
కుప్తంగా చెప్పాలంటే కార్యం మీద మాత్రమే కన్నుగా ప్రవర్తించే వీరు అనవసర విషయాల కోసం సమయాన్ని వృధా చేయరు. అయితే మానసికంగా మాత్రం వీరు బాగా సున్నితమైన స్వభావాన్ని కల్గి ఉంటారు. కోపాన్ని తగ్గించి అందరితో కలిసిపోయే స్వభావాన్ని ప్రదర్శించగల్గితే వీరికి తిరుగుండదని చెప్పొచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|