|
| జెనీలియా | |
పుట్టిన రోజు : ఆగస్టు 5, 1987 అదృష్ట సంఖ్య: 6, 8 ''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ సినీరంగ అభిమానుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. జెనీలియా అసలు పేరు జెనీలియా డిసౌజా. ఇంగ్లాండ్‌లో పుట్టిన జెనీలియా తల్లిదండ్రుల పూర్వీకం గోవా కాగా తర్వాత తన తండ్రి వ్యాపారం నిమిత్తం వారి మకాంను ఇంగ్లాండుకు మార్చుకున్నారు.
అనంతరం 2000 సంవత్సరంలో శంకర్ దర్శకత్వంలో ''బాయ్స్'' చిత్రంతో తెలుగు తెరపై కనిపించిన జెనీలియా తొలి చిత్రంలో మంచి పేరు సంపాదించడంతో వెంట వెంటనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ భాషల్లోనూ తన హవా సాగిస్తోంది.
తర్వాత జెనీలియా తెలుగులో సత్యం, మస్తీ, సాంబా, షై, హ్యాపీ, థీ చిత్రాల్లో నటించినప్పటికీ సిద్దార్థ్ సరసన నటించిన బొమ్మరిల్లు చిత్రం జెనీలియా సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ చిత్రం బాక్సాఫీసును బద్దలు కొట్టింది.
చూసేందుకు కొంత సాఫ్ట్‌గా కనిపించినప్పటికీ మాటల్లో మాత్రం దిట్ట. జెనీలియా ఎప్పుడూ ఉత్సాహంగాను, చెలాకిగాను కనిపిస్తున్నప్పటికీ ఆమెకి కోపం కూడా ఎక్కువే. అయినప్పటికీ సమయ సందర్భాన్ని బట్టి కోపతాపాలను కంట్రోల్ చేసుకుంటుంది. అదే ఆమె విజయాలకు పటిష్టతను చేకూర్చినప్పటికీ కెరీర్‌లో ఓడిదుడుకులు తప్పడం లేదు.
ఎప్పుడూ ఆటలు, పాటలు, వినోదం ఈమెకు నచ్చిన అంశాలు కాగా ఏడుపులు, ఈర్ష్యా ద్వేశాలు ఈమెకు నచ్చని అంశాలు. జెనీలియాకు మాత్రమే కాక ఆగస్టు 5న పుట్టిన వారందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయి.
అవకాశాలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటున్నా విజయాలను సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. మీ విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. అలా చేయడం ద్వారా ఇతరుల వెన్నుపోటు దెబ్బల నుంచి తప్పించుకోవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|