యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
భూమికా చావ్లా
- వెంగళరావు
పుట్టిన రోజు : ఆగస్టు 21, 1978
అదృష్ట సంఖ్యలు : 4, 6

యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇటీవల విడుదలైన సత్యభామ హిట్‌తో తెలుగువారికి మరింత దగ్గరైంది.

తమిళనాడులో పుట్టిన భూమిక తన పాఠశాల చదువును ఢిల్లీలో ముగించుకుని ముంబైకి చేరింది. అక్కడ 1997లో ప్రకటనలు, హిందీ మ్యూజిక్ ఆల్బం‌లతో భూమిక తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.

అనంతరం 2000 సంవత్సరం యువకుడు చిత్రతో తెలుగు తెరపై కనిపించిన భూమిక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించిన ఖుషీ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. దీంతో వెంట వెంటనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న భూమిక తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ భాషల్లోనూ తన హవా సాగిస్తోంది.

యువకుడు, బద్రి, నా ఆటోగ్రాఫి దివ్య, జైచిరంజీవ, మాయాబజార్, అనసూయ, సత్యభామలు ఆమె నటించిన హిట్ చిత్రాలలో కొన్ని. భారీ స్థాయిలో ప్రేక్షకులను సంపాదించుకున్న భూమిక గత ఏడాది డిసెంబర్‌లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకుంది.

భూమికకు తల్లిదండ్రులతోపాటు ఓ అన్న, అక్కలు కూడా ఉన్నారు. కుంటుంబంలో అందరి కంటే చిన్నది కావడంతో గారాభంగా పెరిగిన భూమిక అతి సుకుమారత్వం గలది. జాతీయ అవార్డు పొందడమే తన లక్ష్యమంటున్న భూమిక తాను చేసే ప్రతి పనిలోను సంతోషాన్ని పొందుతున్నానంటోంది.

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం గల భూమిక ముఖంలో అమాయకత్వం ఇట్టే ఉట్టిపడుతుంది. అదే ఆమె విజయాలకు పటిష్టతను చేకూర్చినప్పటికీ కెరీర్‌లో ఓడిదుడుకులు తప్పలేదు.

వినోదం, ప్రేమ, పిల్లలు, సంబరాలు ఈమెకు నచ్చిన అంశాలు కాగా శతృత్వం, బోధనలు ఈమెకు నచ్చని అంశాలు. భూమికాకు మాత్రమే కాక ఆగస్టు 21న పుట్టిన వారందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయి.

అవకాశాలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటున్న ఆమె విజయపరంపర కొనసాగించేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ప్రయాణాల వలన అలస ఏర్పడినప్పటికీ లాభించగలవు. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. అలా చెప్పడం ద్వారా అవి మీ అభివృద్ధికి ఆటంకాన్ని కలించే అవకాశం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...