యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
అనుష్క
- వెంగళరావు
పుట్టిన సంవత్సరం: 1981
అదృష్ట సంఖ్యలుః 2, 4, 7

సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. బెంగళూరుకులో కళాశాల చదువును పూర్తిచేసుకున్న ఈ కన్నడ భామ యోగా నేర్చుకుంది. అనంతరం యోగ టీచర్‌గా పనిచేస్తూ వచ్చింది. ఒక రోజు అనుకోకుండా ఈ ముద్దు గుమ్మ పూరి జగన్నాద్ కంట పడింది. అంతే అనుష్క నాగార్జునా సరసన సూపర్ చిత్రంతో తెలుగు తెరపై వెలిగింది.

చక్కని శరీర సౌష్టవాలకు అభినయాన్నీ అందంగా జతచేసిన అనుష్క అనతి కాలంలో తెలుగు సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. సూపర్, స్టాలిన్ (ఐటమ్ సాంగ్), విక్రమార్కుడు, నీరజ గోస్వామి, అస్త్రం, లక్ష్యం, డాన్‌ల హీట్‌లతో ముందుకు దూసుకెళుతున్న అనుష్క తమిళంలో కూడా మాధవన్‌ సరసన రెండు సినిమాలో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

అందాలను విరజిమ్ముతూ విజయాలను కొనసాగించే అనుష్క ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఒక్క మగాడు, జగతిపతి బాబుకు జోడిగా స్వాగతం, హీరోయిన్ ప్రాధాన్యత కనిపించే అరుంధతి, సుమంత్‌కు సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే అనుష్క అనవసరంగా ఒత్తిళ్ళకు గురవకుండా, అందరితో కలుపుగోలుగా, ప్రశాంతంగా, టేకిట్ ఈజీ పాలసీతో ముందుకు సాగుతుండటం ఆమె ప్లస్ పాయింట్లుకాగా, క్రమం తప్పని యోగా, ప్రశాంత చిత్తం ఆమె ప్రత్యేకతలు.

వినోదం, ప్రేమ, పిల్లలు, సంబరాలు ఈమెకు నచ్చిన అంశాలు కాగా, ఓటమి, శతృత్వం, అధికారం ఈమెకు నచ్చని అంశాలు. అవకాశాలతో పాటు ప్రశంసలు కూడా అందుకునే అనుష్క విజయపరంపర కొనసాగించేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఆమె ప్రయాణాలు లాభించడంతో పాటు కొత్త పరిచయాలు బలపడుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...