|
| జగపతిబాబు | |
పుట్టిన తేదీః ఫిబ్రవరి 12, 1969 అదృష్ట సంఖ్యలుః 4, 8 తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో జగపతి బాబు కూడా ఒకరు. చక్కటి కుటుంబ కథాచిత్రాలు, ఓ మోస్తరు హాస్యభరితమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే జగపతిబాబు సమయానుకూలంగా యాక్షన్ చిత్రాల్లో కూడా తన సత్తా చూపించారు.
ప్రముఖ దర్శకనిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ కుమారునిగా చిత్ర రంగప్రవేశం చేసినప్పటికీ అనతి కాలంలోనే జగపతిబాబు తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
రామగోపాల్ వర్మ్, కృష్ణవంశీ, గుణశేఖర్, సురేశ్ కృష్ణ, మణిరత్నం తదితర ప్రముఖ దర్శకుల చిత్రాల్లో జగపతిబాబు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. లక్ష్యం, పెళ్లైన కొత్తలో, సామాన్యుడు, పెద్దబాబు, ఖుషీఖుషీగా, హునుమాన్ జంక్షన్, సముద్రం, మూడుముక్కలాట, మనోహరం, మనసులోమాట, శుభాకాంక్షలు, అంత:పురం, శుభలగ్నం, పెళ్లిపందిరి, గాయం, పెద్దరికం, బలరామకృష్ణులు తదితర హిట్ చిత్రాల్లో నటించిన జగపతిబాబు పలు అవార్డులు కూడా పొందారు.
దయాద్ర హృదయం కల జగపతిబాబు ఎవరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసినా వెంటనే స్పందించి తన వంతు సాయాన్ని చేయడానికి సిద్ధపడే వ్యక్తి. న్యాయంవైపే నిలిచి, తన మంచి మనసుతో ఎదుటివారి హృదయాలను గెలుచుకునే జగపతిబాబుకు స్నేహితులు పరిమితంగానే ఉన్నారు. తన ప్రతిభా, సామర్థ్యాలతో చుట్టూ ఉన్న వారిని సంతోషంగా పెట్టుకోవాలన్నదే జగపతిబాబు ఆశయంగా కన్పిస్తుంటుంది. ఈ లక్షణాలు జగపతి బాబుకు మాత్రమే కాకుండా ఫిబ్రవరి 12 తేది జన్మించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|