|
| స్నేహ | |
పుట్టిన తేదీః అక్టోబర్ 12 అదృష్ట సంఖ్యలుః 2, 4, 6
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న అగ్ర తారల జాబితాలో ఉన్న నటి స్నేహ, ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
తొలి వలపు సినిమాతో తన వలపులను తెలుగు తెరకు పరిచయం చేసిన స్నేహ రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, హనుమాన్ జంక్షన్, పాండు, ఏమండోయ్ శ్రీవారు, మదుమాసం, మహారధి, ప్రియమైన నీకు తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆదివిష్టు, పాండురంగ, శ్రీకాంత్‌కు జంటగా మరో చిత్రంలోను నటిస్తుంది.
ఎంగెన ఒరు నిలా పక్షీ అనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన స్నేహ అసలు పేరు సుభాషిణి. ముంబాయిలో జన్మించి, దుబాయ్‌లో పెరిగిన స్నేహా పూర్వీకం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి కావడం విశేషం. మలయాళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన స్నేహ అనతి కాలంలోనే తమిళ, తెలుగు సినిమాలతో తన స్థానాన్ని నిలుపుకుంది.
నవ్వుతో అందరినీ ఆకట్టుకోగల స్నేహ తన కళ్ళతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈమెను తమిళ అభిమానులు పున్నగై ఇళవరసి (నవ్వుల యువరాణి)గా కూడా పిలుస్తుంటారు. అందరితోనూ దగ్గరగా కలిసి మెలసి ఉండటంతో పాటు ఊహా జనిత శక్తి, దయార్ద్ర హృదయం ఆమె ప్లస్ పాయింట్లు. ప్రతి విషయంలోను అతిజాగ్రత్త ఆమె ప్రధాన మైనస్ పాయింట్.
సంగీతం, డ్యాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం హాబీగా పెట్టుకున్న స్నేహకు ఓటమి, శతృత్వం, అధికారం, బోధనలు నచ్చని అంశాలు. స్నేహకు మాత్రమే కాక అక్టోబర్ 12న పుట్టిన వారందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయి.
అవకాశాలతో పాటు ప్రశంసలు కూడా అందుకునే ఆమె విజయపరంపర కొనసాగించేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ప్రయాణాలు లాభించడంతో పాటు కొత్త పరిచయాలు బలపడుతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|