|
| విక్టరీ వెంకటేశ్ | |
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో విక్టరీ వెంకటేశ్ కూడా ఒకరు. అభిమానులు ముద్దుగా వెంకీ అని పిలుచుకుంటారు. వెంకీ అసలు పేరు దగ్గుబాటి వెంకటేశ్. ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారునిగా చిత్ర రంగ ప్రవేశం చేసినప్పటికీ తక్కువ కాలంలోనే వెంకీ తెలుగు సినీ రంగంలో తన కంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పరుచుకున్నారు.
వెంకటేశ్ అమెరికాలోని మాంటెరీ యూనివర్శిటీలో ఎంబీఎ డీగ్రీ పూర్తి చేశాడు. చదువు అనంతరం అనుకోని పరిస్థితుల్లో 1986న కలియుగ పాండవులు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ తొలి చిత్రంతోనే (కలియుగ పాండవులు) నంది అవార్డును పొందడం విశేషం. ఆ తర్వాత కూడా తన విజయపరంపరను కొనసాగిస్తూ విక్టరీ పేరును వెంకీ మకుటంగా మార్చుకున్నారు.
హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడంతో విక్టరీ పేరు అలాగే నిలిచిపోయింది. శ్రీనివాస కళ్యాణం, స్వర్ణకమలం, బొబ్బిలి రాజా, చంటి, చిన్నరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, ధర్మచక్రం, ప్రేమించుకుందాం రా, గణేశ్, కలిసుందాం రా, నువ్వునాకునచ్చావ్ వంటి విభిన్న హిట్ చిత్రాలు వెంకీ నటనా ప్రతిభను చాటుతాయి. లక్ష్మీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే హిట్‌లకు తోడు వెంకీ తాజా చిత్రం తులసీ కూడా మంచి కలెక్షన్లతో ముందుకెళుతోంది.
ఎల్లవేళలా న్యాయం వైపే నిలిచి, తన మంచి మనసుతో ఎదుటివారి హృదయాలను గెలుచుకునే వెంకటేశ్‌కు స్నేహితులు కూడా కాస్త ఎక్కువే. తన ప్రతిభా, సామర్థ్యాలతో చుట్టూ ఉన్న వారిని సంతోషంగా పెట్టుకోవాలన్నదే వెంకీ ఆశయంగా కన్పిస్తుంటుంది. అదే సమయంలో స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. వెంకీకే కాదు అదే రీతి జాతకం కలిగిన వారందరూ ఈ గుణాలను కలిగి ఉంటారు.
సమాజంలో తనకు ఎటువంటి కళంకం రాకుండా ఉండేందుకు అన్ని రకాలుగా జాగ్రత్త పడే వెంకటేశ్‌కు కుటుంబమంటే అమితమైన ప్రేమ. అంతేకాక సమాజంపై కూడా శ్రద్ధ కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త ఎక్కువే. జూన్, జులై, డిసెంబర్ మాసాల్లో పుట్టిన వారు వీరికి మంచి మిత్రులు కాగలరు. ఇలాంటి మంచి గుణాలు కలిగిన ఈ తరహా జాతకులకు విజయం తనంతట తానుగా వెతుక్కుంటూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయాల్సి వచ్చినప్పటికీ, అంతిమ విజయం మాత్రం వీరిదే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|