యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
సూర్య
- సంకలనం: వెంగళరావు
పుట్టిన తేదీ: జూలై 23, 1975
అదృష్ట సంఖ్యలుః 4, 7

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ హీరోల్లో సూర్య కూడా ఒకరు. యువ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సూర్య అనతికాలంలోనే భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.

శివపుత్రుడు, యువ, గజినీ, వేల్ వంటి చిత్రాల్లో నటించి తమిళ తెరపై అగ్ర కథానాయకునిగా చెలామణి అవుతున్న సూర్య మరో వైపు తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

పాతతరం తమిళ హిరో శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య కళాశాల విద్య ముగించుకున్న అనంతరం డ్రస్ డిజైనర్‌గా కొంతకాలం పనిచేశాడు. అయితే తండ్రి సినిమా నేపథ్యంతో 1997లో నేరుక్కు నేర్ అనే తమిళ చిత్రం ద్వారా సూర్య వెండితెరకు పరిచయమయ్యాడు.

ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులు కఠిన కృషితో అధిగమించి ప్రస్తుతం తమిళ తెరపై మాస్ హీరోలలో ఒకరుగా నిలిచిపోయాడు. సినీ జీవితమే కాకుండా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా సూర్య చురుగ్గా పాల్గొంటాడు.

ప్రేమ పేరుతో రోజుకొకరితో తిరిగి చివరికి మరొకరిని పెళ్ళాడే సినీ లోకంలో ప్రేమించిన అమ్మాయి (ప్రముఖ హీరోయిన్ జ్యోతిక)నే సూర్య వివాహం చేసుకున్నాడు. వృత్తిపరంగా పోటీతత్వం ఉన్నప్పటికీ అందరితోనూ స్నేహ పూర్వంగా ఉండడం ఆయనకే తగింది. అందరినీ ఆకట్టుకునే సౌష్ఠవం ఆయన ప్లస్ పాయింట్.

నిజాయితీ, ఆత్మస్థైర్యం, అర్థవంతమైన జీవితం, అభ్యసించే తత్వం వంటి లక్షణాలు ఈయనకు మాత్రమే కాకుండా జూలై 23 తేదిన పుట్టిన అందరికీ వర్తిస్తాయి. స్నేహితులకు, బంధువులను తగిన విధంగా ప్రోత్సహిస్తారు.

చిరకాలంగా ఎదురుచూస్తున్న పనులను పూర్తి చేస్తారు. ఈ మాసం చివరిలో విజయవంతమైన వార్తలు వింటారు. కొత్త పరిచయాలు అధికం కాగలవు. విదేశీ ప్రయాణాలు సంతృప్తికరంగా సాగుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...